Skip to main content

Namaste NRI

నారీ నారీ నడుమ మురారి భల్లే భల్లే సాంగ్ రిలీజ్

శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి. సాక్షి వైద్య కథానాయిక. రామ్‌ అబ్బరాజు దర్శకుడు. అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. మంగళవారం భల్లే భల్లే అనే గీతాన్ని విడుదల చేశారు. కేరళ పచ్చని ప్రకృతి అందాల నడుమ ఈ ప్రేమగీతం ఆకట్టుకునేలా సాగింది. ప్రతీ ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా పండగ వాతావరణాన్ని తలపించింది. ప్రేమలోని మధుర భావాల్ని ఆవిష్కరించే గీతమిదని, నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, నిర్మాతలు: అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌ అబ్బరాజు.

Social Share Spread Message

Latest News