Skip to main content

Namaste NRI

పతంగ్‌ ట్రైలర్‌కి అనూహ్య స్పందన

ప్రీతి పగడాల, ప్రణవ్‌ కౌశిక్‌, వంశీ పూజిత్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన స్పోర్ట్స్‌ డ్రామా పతంగ్‌. గౌతమ్‌ వాసుదేవమీనన్‌, ఎస్పీచరణ్‌ కీలక పాత్రధారులు. ప్రణీత్‌ ప్రత్తిపాటి దర్శకుడు. విజయ్‌ శేఖర్‌ అన్నే, సంపత్‌ మాకా, సురేశ్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ట్రైలర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు.

ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచిందనీ, వరల్డ్‌ క్లాస్‌ లెవల్‌లో ఈ సినిమాలోని పతంగ్‌ పోటీల సీజీ ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాతో తామందరిదీ భావోద్వేగ ప్రయాణమని, కైట్‌ స్పోర్ట్స్‌ డ్రామా తీయడం తేలికైన విషయం కాదని, ప్రీతి పగడాల పేర్కొన్నారు. సురేష్‌ కొత్తింటి మాట్లాడుతూ యూత్‌ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌గా ఈ సినిమా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News