Skip to main content

Namaste NRI

డెన్మార్క్ రాణి సంచలన ప్రకటన

డెన్మార్క్ రాణి రెండ‌వ మార్‌గ్రేత్ త‌న సింహాస‌నాన్ని త్య‌జించారు. న్యూ ఇయ‌ర్ వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  జ‌న‌వ‌రి 14వ తేదీన ఆమె అధికారికంగా ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటారు. 52 ఏళ్ల నుంచి ఆమె డెన్మార్క్ రాణిగా కొన‌సాగారు. కుమారుడు ప్రిన్స్ ఫెడ్రిక్‌కు త‌న సింహాస‌నాన్ని అప్ప‌గించ‌బోతున్న‌ట్లు డెన్మార్క్ రాణి తెలిపారు. రాణి మార్‌గ్రేత్ వ‌య‌సు 83 ఏళ్లు. యూరోప్ దేశాల్లో అత్య‌ధిక కాలం సింహాస‌నంపై ఉన్న రాణిగా ఆమెకు గుర్తింపు ఉన్న‌ది. 1972లో ఆమె త‌న తండ్రి కింగ్ ఫ్రెడ్రిక్ మ‌ర‌ణం త‌ర్వాత సింహాస‌ నాన్ని అధిరోహించారు. ఇటీవ‌ల వెన్నుకు స‌ర్జ‌రీ చేయించుకున్నట్లు ఆమె త‌న ప్ర‌సంగంలో తెలిపారు.

ఇన్నాళ్లూ రాణిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన మార్‌గ్రేత్‌కు ప్ర‌ధాని మేట్ ఫెడ‌రిక్స‌న్ థ్యాంక్స్ తెలిపారు. రాణి మార్‌గ్రేత్ వైదొల‌గ‌నున్న చివ‌రి రోజే యువ‌రాజు ఫెడ్రిక్‌పై నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. కోపెన్‌హెగ‌న్‌లో ఉన్న అమ‌లిన్‌బోర్గ్ క్యాసిల్‌లో అప్ప‌గింత ప్ర‌క్రియ జ‌ర‌గ‌నున్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events