Namaste NRI

 ఆ విజయంలో భారతీయురాలి పాత్ర

అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ ప్రైమరీ సేనేటర్‌ ఎన్నికల్లో జేడీ వాన్స్‌ గెలిచారు.  డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుతో జేడీ వాన్స్‌ ఈజీగా విక్టరీ కొట్టారు. ఇక నవంబర్‌లో జరిగే సేనేట్‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి టిమ్‌ ర్యాన్‌తో ఆయన పోటీ పడనున్నారు. అయితే రిపబ్లికన్‌ అభ్యర్థి జేడీ వ్యాన్స్‌ భార్య భారతీయ సంతతి వ్యక్తి కావడం విశేషం. భారతీయ మూలాలు ఉన్న ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్‌. శాన్‌ఫ్రాన్సిస్‌కో, వాషింగ్టన్‌ డీసీల్లో ఆమె ఓ న్యాయ సంస్థలో లిటిగేటర్‌గా పనిచేస్తున్నారు.  సివిల్‌ కేసులు వాదించడంలో ఆమె దిట్ట. ఉన్నత విద్య, స్థానిక ప్రభుత్వం, ఎంటర్‌టైన్మెంట్‌, టెక్నాలజీ రంగాల్లోనూ ఉషా చిలుకూరి కేసుల్ని వాదిస్తుంటారు. యేలేలో న్యాయ విద్య అభ్యసిస్తున్న సమయంలో జేడీ వ్యాన్స్‌, ఉసా చిలుకూరి మధ్య పరిచయం ఏర్పడిరది. 2014లో వారిద్దరి మధ్య వివాహం జరిగింది. జేడీ వాన్స్‌ పుస్తక రచయిత కూడా. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉషా తన భర్తతో కలిసి ఓహియోలోని సిన్‌సినాటిలో ఉంటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events