Skip to main content

Namaste NRI

చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం : మోదీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్‌లో సంభాషించారు. పుతిన్‌ భారత్‌లో పర్యటించిన సందర్భంగా కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు, నిర్ణయాల అమలుపై ఇద్దరు నేతలు సమీక్షించారు. ఇంధనం, ఆహార విపణి తదితర ప్రపంచ అంశాలపైనా వారు ఫోన్‌లో చర్చించారు. ముఖ్యంగా, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, ఉత్పాదనల పరస్పర వాణిజ్యం వారు సమాలోచనలు చేశారు. ఇద్దరి మధ్య సంభాషణలో ఉక్రెయిన్‌ సంక్షోభం  కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న భారత్‌ వైఖరిని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు.  ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై ఉభయ దేశాలు క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతుండాలని మోదీ, పుతిన్‌ నిర్ణయించారు.

Social Share Spread Message

Latest News