Namaste NRI

హీరోయిన్‌ మర్డర్‌ మిస్టరీ.. సస్పెన్స్‌గా కార్తీక్‌ రాజు అథర్వ ట్రైలర్

సస్పెన్స్‌, క్రైమ్‌ జానర్‌లో తెరకెక్కిన చిత్రం అథర్వ. కార్తీక్‌ రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా ప్రధానపాత్రధారులు. మహేశ్‌రెడ్డి దర్శకుడు. సుభాష్‌ నూతలపాటి నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. టాలీవుడ్‌ హీరోయిన్ జ్యోస్ని హుపారికర్ హత్యకు గురైంది. ఆమెతోపాటు సిటీలో మరో మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయి సార్‌ అంటూ సాగే సంభాషణలతో షురూ అయింది ట్రైలర్‌. ఈ హత్యలను అథర్వ ఎలా ఛేదించాడనే నేపథ్యంలో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్‌. అతి కిరాతకమైన క్రిమినల్ కేసులను చేధించేందుకు అథర్వ రెడీ అవుతున్నట్టు చెప్పేశాడు డైరెక్టర్‌.

అతిథులుగా విచ్చేసిన దర్శకుడు శశికుమార్‌ తిక్కా, హీరో చైతన్యరావులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. క్లూస్‌ డిపార్ట్‌మెంట్‌ని క్లుప్తంగా చూపించబోతున్నాం. ఉత్కంఠను రేకెత్తించే విధంగా కథ, కథనాలు సాగుతాయి. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ అని అన్నారు ఇంకా చిత్రం యూనిట్‌ సభ్యులందరూ మాట్లాడారు. ఈ సినిమాను డిసెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో.. భారీగా రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events