Namaste NRI

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలోకి చొరబడిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. టెక్సాస్‌ ఆర్లింగ్టన్‌లోని ఓ హైస్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది.  ఈ సందర్భంగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి మాట్లాడుతూ పాఠశాలలో జరిగిన కాల్పులకు అధికారులు స్పందించారన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలయ్యాయో ఇంకా నిర్ధారించలేదని తెలిపారు. అధికారులు విచారణ జరుపుతున్నారని పోలీస్‌ శాఖ తెలిపింది. కాల్పుల నేపథ్యంలో పాఠశాలల వెలుపల అంబులెన్స్‌లు, ఫైరింజన్లను మోహరించారు.

Social Share Spread Message

Latest News