Skip to main content

Namaste NRI

అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియాలో ఈ ఘటన చోటు చేసుకుకున్నది. బ్రిడ్జ్‌వాటర్‌ కాలేజీలో ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఆ కాలేజీలో సెక్యూర్టీ ఆఫీసర్లుగా చేస్తున్న పోలీస్‌ ఆఫీసర్‌ జాన్‌ పెయింటర్‌, క్యాంపస్‌ సేఫ్టీ ఆఫీసర్‌ జేజే జెఫర్సన్‌ను హతమార్చాడు. క్యాంపస్‌లో ఓ అనుమానాస్పద వ్యక్తి తిరుగుతున్నట్లు తొలుత పోలీసులకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. పోలీసులు అక్కడికి వెళ్లడంతో ఆ అనుమానితుడు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో కాలేజీ సెక్యూర్టీ పోలీసులు మృతి చెందారు. ఆ ఆర్ట్‌ కాలేజీలో సుమారు 1800 విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పులు జరిపిన నిందితుడిని 27 ఏళ్ల అలెగ్జాండర్‌ వాయత్‌ క్యాంప్‌బెల్‌గా అనుమానిస్తున్నారు.  ప్రస్తుతం అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. రాకింగ్‌హోమ్‌ కౌంటీ జైలులో అతన్ని బంధించారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events