Skip to main content

Namaste NRI

నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జమాన. భాస్కర్‌ జక్కుల దర్శకుడు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్‌, శివకాంత్‌, శశికాంత్‌ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్‌ జక్కుల మాట్లాడుతూ ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. మంచి థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తీశాం. ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్‌లు ఈ సినిమాలో ఉంటాయి అని తెలిపారు. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్‌ చాలా గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ ప్లేతో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను అని నిర్మాత శివకాంత్‌ చెప్పారు.

హీరో సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ కష్టపడి చేసిన ఈ సినిమా జనవరి 30న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాం అని అన్నారు. నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుం. నేటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి అని చిత్రయూనిట్‌ తెలిపింది. స్వాతి కశ్యప్‌, జారా తదితరులు నటిస్తున్నా న్న ఈ చిత్రానికి కెమెరా: జగన్‌ ఏ, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, సంగీతం: కేశవ కిరణ్‌, రచన-దర్శకత్వం: భాస్కర్‌ జక్కుల.

Social Share Spread Message

Latest News