Skip to main content

Namaste NRI

సమాజానికి ఉపయోగపడే సినిమా ఇది

రఘు కుంచే ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మా నాన్న నక్సలైట్‌. ఈ సినిమాను పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి రూపొందించారు. చదలవాడ శ్రీనివాసరావు నిర్మించారు. అజయ్‌ సుబ్బరాజు, ఎల్‌.బి.శ్రీరామ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ నక్సల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఒక అద్భుతమైన తండ్రీ కొడుకుల కథే ఈ చిత్రం. ఇది ప్రతి ప్రేక్షకుడి మనసుని హత్తుకుంటుంది అన్నారు. మా చిత్ర పాటలు, ట్రైలర్‌ బాగున్నాయని అందరూ అంటున్నారు. సునీల్‌ కుమార్‌తో  మరిన్ని చిత్రాలు చేస్తా అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. దర్శకుడు అజయ్‌ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే చిత్రమిది. ఇందులో ప్రతి డైలాగ్‌  ఆణిముత్యంలా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులు ఆదరించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రేలంగి  నరసింహారావు, దర్శకుడు అజయ్‌, కాశీ విశ్వనాథ్‌, ప్రసన్నకుమార్‌, లిరిక్‌ రైటర్‌ రవీంద్రబాబు, నటుడు కృష్ణ, నటి రేఖ నిరోషా, దర్శకుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News