అధ్యక్ష ఎన్నికలతో అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మొదటిసారి ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. వాడీవేడిగా సాగిన ఈ డిబేట్‌లో పరస్పర విమర్శల దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
కమలా హారిస్‌తో డిబేట్‌పై ట్రంప్ తొలిసారి స్పందించారు. ఇది ఓ గొప్ప చర్చగా అభివర్ణించారు. ఎప్పటికీ ఇది అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. హారిస్‌తో మరో చర్చకు సిద్ధమని ప్రకటించా రు. కమలా హారిస్ కూడా ట్రంప్‌తో సెకెండ్ డిబేట్‌కు సిద్ధమైనట్లు ఉపాధ్యక్షురాలి ప్రచార చైర్ జెన్ ఓ మల్లే డిల్లాన్ తెలిపారు. అక్టోబర్‌లో రెండో డిబేట్ ఉంటుందని తెలిపారు. కాగా, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.