యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్ సంయుక్త నిర్మాణంలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారి అని టీజర్‌లో సాయిచంద్ ఓ విషయాన్ని ప్రస్తావించడం, అదే సమయంలో దీనికి పరిష్కారం ఉందా? లేదా అని సాయిచంద్‌ని ప్రశ్నించగా దీని నుంచి బయటపడటానికి మనకు ఒకే ఒక మార్గం వుందని సాయిచంద్ చెబుతాడు ఇలా పలు పలు ఆసక్తికరమైన ప్రశ్నలను టీజర్ రేకెత్తిస్తుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ బండ్రెడ్డి, క్రియేటివ్ ప్రొడ్యూసర్: సతీష్ బీకేఆర్.














