Skip to main content

Namaste NRI

అదృష్టం అంటే ఇదేనేమో..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు

అదృష్టం అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది.  ఒక్కసారి అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది. ఈ భారతీయ ప్రవాసుడి విషయంలో అదే జరిగింది. కేరళకు చెందిన శ్రీజు  గత 11 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. ఫుజైరహాలోని ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో టెక్నిషీయన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీజు గత మూడేళ్లుగా మహజూజ్ డ్రాలో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. తాజాగా మనోడికి అదృష్టం వరించింది. ఆదివారం తీసిన మహజూజ్ డ్రాలో శ్రీజుకు ఏకంగా 20 మిలియన్ దిర్హమ్ల ప్రైజ్‌మనీ దక్కింది.  భారత కరెన్సీలో అక్షరాల రూ. 45కోట్లు.  ఇక ఈ భారీ మొత్తం దక్కడం పట్ల మనోడి ఆనందానికి అవధులేకుండా పోయాయి. ఇంత డబ్బు గెలుస్తానని కలలో కూడా ఊహించలేదని చెప్పుకొచ్చాడు. మొదట తనకు లాటరీ తగిలిన విషయం తెలియగానే నమ్మలేదని, రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పడంతో నమ్మినట్లు తెలిపాడు. ఇక తాను గెలిచిన భారీ మొత్తంతో తన స్వగ్రామంలో ఇల్లు కొనుగోలు చేస్తానని చెప్పాడు. ఇలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో లాటరీల పుణ్యమా అని మధ్యతరగతికి చెందిన మనోళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతున్నారు.

Social Share Spread Message

Latest News