అమెరికా అందించే కమ్యూనిటీ కాలేజ్ ఇన్షియేట్ ప్రోగ్రాం ఫెలోషిప్‌కు సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీ విద్యార్థినులు ముగ్గురు ఎంపికయ్యారు. అమెరికన్ కాన్సులేట్ జరిపిన అనేక రౌండ్ల ఇంటర్వ్యూల్లో శిరీష, బ్లోసమ్, ప్రీతి సత్తా చాటారు. శిరీష న్యూయార్క్‌లోని జేమ్‌స్టన్ కమ్యూనిటీ కాలేజీలో, ప్రీతి ఓహియోలోని సింక్లెయిన్ కమ్యూనిటీ కాలేజీలో, బ్లోసమ్ బాల్టిమోర్ కమ్యూనిటీ కాలేజీలో ఉన్నత విద్యకు ఎంపికయ్యారు. గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ముగ్గురు విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ఆరేండ్లలో అమెరికన్ కమ్యూనిటీ కళాశాలకు 20 మంది ఎంపికైనట్టు ఆయన తెలిపారు.