Skip to main content

Namaste NRI

మూడుతరాల అభిమానాన్ని పొందడం పూర్వజన్మ సుకృతం : బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ  కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్‌ కేసరి. శ్రీలీల, కాజల్‌ కీలక పాత్రధారులు. ఇటీవల విడుదలై ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ గ్రాండ్‌ బాక్సాఫీస్‌ కాషేర్‌ సెలబ్రేషన్‌ని నిర్వహించారు. సీనియర్‌ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ వేడుకకు అతిథిగా హాజరయ్యారు. బాలకృష్ణ  మాట్లాడుతూ జనాభిమానానికి మించిన సంపద, తద్వారా వచ్చే సంతోషం ఈ రెండింటినీ వెలకట్టలేం. ఆ ఆనందాన్ని నేను చాలాసార్లు అనుభవించాను. సుదీర్ఘమైన నా నట ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించే అదృష్టం నాకు కలిగింది. మూడు తరాల అభిమాన పాత్రుడ్ని అవ్వడం నిజంగా నా పూర్వజన్మసుకృతం అన్నారు.  ప్రయోగాత్మక చిత్రాలనూ, వైవిధ్యభరితమైన పాత్రలనూ ప్రజలు తప్పక ఆదరిస్తారని నాన్నగారు అంటుండేవారు. భగవంత్‌కేసరి ఆయన మాటను నిజం చేసింది.అందరం కష్టపడి ఇష్టంతో చేసిన సినిమా భగవంత్‌కేసరి . త్వరలో ఈ సినిమా హిందీలో రాబోతున్నది. తొలిసారి హిందీలో డబ్బింగ్‌ చెప్పాను. హిందీపై తెలుగువారికివున్న భాషా పటిమ, సత్తా ఏంటో ఈ సినిమా నిరూపిస్తుంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. అందులో బ్లడ్‌ బాత్‌ బ్రాండ్‌ ఎలా ఉండబోతుందో చూస్తారు. ఇలాగే మంచి సినిమాలు చేస్తూ, ఓవైపు బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌గా, మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా నావంతు సేవలను అందిస్తూ ముందుకు సాగే అవకాశం ఆ భగవంతుడు నాకివ్వాలని, అలాగే జనమంతా బావుండాలని కోరుకుంటున్నా అని ఆకాంక్షించారు. నా కెరీర్‌లోనే విభిన్నమైన సినిమా భగవంత్‌కేసరి అన్నారు

నాకెన్నో మధురమైన జ్ఞాపకాలిచ్చిన సినిమా ఇది. మళ్లీ బాలయ్యతో మరొక సినిమా చేయాలనుంది అని అనిల్‌ రావిపూడి అన్నారు. సినిమా విజయం పట్ల చిత్ర యూనిట్‌ని కె.రాఘవేంద్రరావు అభినందించారు. ఈ వేడుకలో  శ్రీలీలతోపాటు  రామజోగయ్య శాస్త్రి, కాసర్లశ్యామ్, డీవోపీ రామ్ ప్రసాద్, మిగతా చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News