టాలీవుడ్ నటుడు, వినాయకుడు హీరో కృష్ణుడు అరెస్ట్ అయ్యాడు. పేకాట కేసులో ఆయన అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ వియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు నటుడు కృష్ణుడుతో పాటు ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. మియపూర్ పోలీసులు చాలా పకడ్బందీగా ఎటాక్ చేసి ఈ ముఠాను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి లక్షా 97 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 8 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.
టాలీవుడ్ ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ అర్టిస్ట్‌గా చేసిన కృష్ణుడు వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, హ్యాపీడేస్, యువత, షాక్, ఆర్య2, స్నేహగీతం, జ్యోతి లక్ష్మి తదితర సినిమాల్లో నటించి నటుడిగా కృష్ణుడు మంచి గుర్తింపు తెచ్చకున్నాడు.