అక్టోబర్ 1-3 తేదీల్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) 11వ ఎడిషన్ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు ట్రెడా జనరల్ సెక్రటరీ సునీల్ చంద్రారెడ్డి తెలిపారు. సుమారు 150 నిర్మాణ సంస్థలు. 400 ప్రాపర్టీలను ప్రదర్శనలో ఉంచనున్నట్లు తెలిపింది.
