Namaste NRI

ట్రంప్ మరో సంచలన నిర్ణయం..హెచ్-1బీ వీసాలో కీలక మార్పులు

వలస విధానాలను సమూలంగా మార్చేయాలనుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసాల జారీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీసా జారీ ప్రక్రియ కోసం సరికొత్త వ్యవస్థను అమలుజేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 20 నుంచి వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారిన్‌ లేబర్‌ యాక్సెస్‌ గేట్‌వే వీసా వ్యవస్థలో పాత రికార్డులు, దరఖాస్తులను తొలగించనుంది. దీంతో హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.

తాజా ఆదేశాల ప్రకారం, మార్చి 20 నుంచి ఐదేండ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్‌ నుంచి తొలగించనున్నారు. అంటే ఉదాహరణకు ఓ దరఖాస్తుకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఐదు సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events