Skip to main content

Namaste NRI

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆహ్వానించిన టిటిఎ టీమ్

తెలంగాణ  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను ఎన్ఆర్ఐ ప్రతినిధులు డా. బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో కలిశారు. ఈ నెల 23న సాయంత్రం రవీంద్రభారతిలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సేవా డేస్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ ఆ సంఘం అధ్యక్షుడు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలిపెద్ది నవీన్, కవితా రెడ్డి, సురేష్ రెడ్డి, గణేష్, జ్యోతిరెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గాప్రసాద్, మనోహర్ తదితరులు ఆహ్వానించారు.  డిసెంబర్ 10 నుంచి ఈనెల 23 వరకు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వారు డిప్యూటీ సీఎంకు వివరించారు. అలాగే వరంగల్‌లో 38 కంపెనీల సహకారంతో జాబ్ మేళా నిర్వహించగా 16,000 మంది హాజరయ్యారని, ఇందులో 1500 మంది నిరుద్యోగులను ఎంపిక చేసామని చెప్పారు. అదే విధంగా 2024 మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్‌లో నిర్వహించే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు కూడా రావాలని విజ్ఞప్తి చేశారు.

Social Share Spread Message

Latest News