Skip to main content

Namaste NRI

భారత్‌ నుంచి చైనాకు రెండు సవాళ్లు  : అమెరికా

భవిష్యత్తులో అగ్రరాజ్యానికి భారత్‌ ముఖ్య భాగస్వామి అవుతుందని అమెరికా నేవీ ఆపరేషన్స్‌ చీఫ్‌ మైక్‌ గిల్డే అన్నారు. హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనాకు చెక్‌ పెట్టడంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్‌ నుంచి చైనాకు రెండు సవాళ్లు ఎదరవుతాయని పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌ జలసంధి వైపు చూడాలని చైనాను బలవంతం చేస్తున్నారని, కానీ చైనా వాస్తవానికి పక్కనున్న భారత్‌ను గమనించాల్సిన అవసరం ఉందన్నారు.   దక్షిణ ఆసియాలో భారత్‌ బలమైన దేశంగా ఉండటం అమెరికా, జపాన్‌కు అవసరం అన్నారు. భారత్‌తో జాగ్రత్తగా ఉండాలనేలా చైనాను అప్రమత్తం చేయాలని సూచించారు. అప్పుడే చైనాకు భారత్‌ సవాల్‌ అవుతుందని అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే తాను ఎక్కువ సమయం గడిపినట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News