తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో బెర్లిన్‌లో ఉన్న శ్రీ గణేశ్ ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. జర్మనీలో భారత రాయబారి పర్వతనేని హరీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారన్నారు. అచ్చ తెలుగు సంప్రదాయంలో ఉత్సవాలు, సాంసృతిక ప్రదర్శనలు నిర్వహించినట్టు చెప్పారు. ఉగాది ప్రాధాన్యతను తెలియజేసేలా, బెర్లిన్‌లోని తెలుగు ప్రవాసుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘు చలిగంటి, ఉపాధ్యక్షుడు వెంకట రమణ బోయినపల్లి, కార్యదర్శి అలేక్య బోగ, సాంసృతిక కార్యదర్శులు శరత్ రెడ్డి, యోగానంద్, కోశాధికారి బాలరాజ్ అందె, సోషల్ మీడియా కార్యదర్శులు నరేష్, నటేష్ గౌడ్, దాదాపు 200 తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు.