Namaste NRI

సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించిన ఉక్రెయిన్‌

యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్‌ సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించింది. సైన్యంలో తీవ్రమైన మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశం, రోబో శునకం బ్యాడ్‌ వన్‌ ను అభివృద్ధి చేసింది. యుద్ధ క్షేత్రంలో, సైనిక ఆపరేషన్లలో వీటిని వాడాలని, త్వరలో వీటిని సైన్యంలో మోహరించబోతున్నట్టు తెలిసింది. సైనిక నిఘా, మందుపాతరలను గుర్తించేందుకు చేపట్టే హై-రిస్క్‌ ఆపరేషన్‌లలో బ్యాడ్‌ వన్‌ లను వాడబోతు న్నట్టు తెలిసింది. ఏడు కిలోల మందుగుండు లేదా ఆయుధాల్ని, యుద్ధ క్షేత్రంలో గాయపడ్డ సైనికుడి వద్దకు ఔషధాల కిట్‌ను ఇవి మోసుకెళ్లగలవు.

Social Share Spread Message

Latest News