ప్రపంచ శాంతి కోసమైన ఉక్రెయిన్, రష్యా దేశాల యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఐరాస సెక్రెటరీ జనర్ ఆంటోనియో గుటెరస్ కోరారు. ఐరాస భద్రత మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మతినేని యుద్ధం వల్ల ప్రపంచానికి హాని తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. ప్రపంచానికి ఆహార, ఎరువుల కొరత తప్పాలంటే ఉక్రెయిన్, రష్యా బెలారస్ల్లో ఉత్పత్తి యథాతథంగా కొనసాగాల్సిందేనన్నారు. ప్రపంచ దేశాలు చేతులు కలపండి, ఇకనైనా యుద్దాన్ని ఆపండి అని పిలుపునిచ్చారు.














