Skip to main content

Namaste NRI

తెలంగాణ కెనడా అసోసియేషన్- ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ, దసరా సంబురాలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ (టిసిఎ) ఆధ్వర్యంలో టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబురాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.  శిల్పా చందా, శ్రీదేవి కల్లేపల్లి,సమత కాకర్ల,వైదేహి భగత్ అన్నపూర్ణ జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.  ఈ సంబరాల్లో 3500కు పైగా తెలంగాణ వాసులు స్థానిక ఆనాపిలిస్ హాల్- మిస్సిసాగాలో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్ గా గెట్-హోమ్ రియాల్టీ  వ్యవహరించినవారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం శాలువాలతో అభినందించి టిసిఎ మొమెంటోస్ బహుకరించారు.

తెలంగాణ కెనడా సంఘం ఈ సందర్భంగా వారి  అధికారిక తెలుగు పత్రిక టిసిఎ బతుకమ్మ సంచికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ  తెలంగాణ ప్రజలకు బతుకమ్మ సంబరాలపై వారికి ఉన్న భక్తిశ్రద్ధలను కొనియాడారు. ఈ నాడు 3500 మందికి పైగా తెలంగాణ కుటుంబాలు ఒక చోట కలుసుకొని పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అత్యుత్తమ బతుకమ్మలను ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణీతలుగా మనస్విని వేలపాటి, ప్రదీపా వాల వ్యవహరించారు. ఇందులో విజేతలకి విభూతి ఫ్యాబ్ స్టూడియోస్ వారు, తెలంగాణ కెనడా అసోసియేషన్, సండైన్ తెలుగు ఫుడ్స్ వారు బహుమతులను అందజేశారు. దసరా సంబురాల్లో భాగంగా దుర్గా పూజా జరిపిన అనంతరం జమ్మి ఇచ్చి పుచ్చుకున్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ అర్ర , సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారిరాహుల్ బాలనేని, డైరెక్టర్లు -నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ సామల, శంకర్ భరద్వాజ పోపూరి, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు మాధురి చాతరాజు, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, ప్రకాష్ చిట్యాల,  సంతోష్ గజవాడ,రాజేశ్వర్ ఈధ, వేణుగోపాల్ రోకండ్ల, విజయ్ కుమార్ తిరుమలపురం, అఖిలేష్ బెజ్జంకి,  శ్రీనివాస తిరునగరి, శ్రీహరి రావుల్, ప్రభాకర్ కంబాలపల్లి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events