మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం సీతారామం. రష్మిక మందన్న ముఖ్య భూమిక పోషించారు. సుమంత్, గౌతమ్ మేనన్, తరుణ్ భాస్కర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా పాటలకు విశేషమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ కానున్న కల్యాణం పాట లిరికల్ వీడియోని విడదుల చేసింది చిత్ర యూనిట్. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుకు హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి, సింధూరి ఈ పాటను ఆలపించిన విధానం అద్భుతంగా వుంది. లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పది కాలాలు గుర్తు పెట్టుకునేలా ఉంది. స్వప్న సినిమా పతాకంపై అశ్వినిదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దృశ్య కావ్యంగా తెరకెక్కుతున్న సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. హను రాఘవపూడి దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాలం బాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.














