Skip to main content

Namaste NRI

సీతారామం నుండి కానున్న కల్యాణం విడుదల

మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ నటించిన చిత్రం సీతారామం. రష్మిక మందన్న ముఖ్య భూమిక పోషించారు. సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌, తరుణ్‌ భాస్కర్‌, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా పాటలకు విశేషమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి థర్డ్‌ సింగిల్‌ కానున్న కల్యాణం పాట లిరికల్‌ వీడియోని విడదుల చేసింది చిత్ర యూనిట్‌. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరపరిచిన ఈ పాట మనసుకు హత్తుకుంది. అనురాగ్‌ కులకర్ణి, సింధూరి ఈ పాటను ఆలపించిన విధానం అద్భుతంగా వుంది. లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పాటకు అందించిన సాహిత్యం పది కాలాలు గుర్తు పెట్టుకునేలా ఉంది. స్వప్న సినిమా పతాకంపై అశ్వినిదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దృశ్య కావ్యంగా తెరకెక్కుతున్న సీతారామంకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. హను రాఘవపూడి దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాలం బాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News