Namaste NRI

ఆశిష్‌కు జోడీగా వైష్ణవి చైతన్య

ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న తాజా చిత్రంలో వైష్ణవి చైతన్య కథానాయికగా ఎంపికైంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ ప్రస్తుతం సరికొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలను రూపొందిస్తున్నది.  ఈ కోవలో ఆశిష్‌ హీరోగా అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవి చైతన్యను కథానాయికగా ఖరారు చేశారు. వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రమిదని, ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్ల, దర్శకత్వం: అరుణ్‌ భీమవరపు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events