వెంకటేష్ నట జీవితంలో దృశ్యం సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ దృశ్యం 2 రూపొందుతోంది. ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకుడు. ఆంటోని పెరం బపూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సంయక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ చిత్రం దృశ్యం 2కు ఇది రీమేక్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చారు. దృశ్యం విజయం సాధించడంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. తొలి భాగంలో కనిపించినా మీనా, నదియా, నరేష్, కృతిక, ఈస్తర్ అనిల్, ఇలా అందరూ కూడా సీక్వెల్‌లో నటిస్తున్నారు. ఇక సపంత్ రాజ్, పూర్ణలు కొత్తగా కనిపించబోతోన్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, కెమెరామెన్ : సతీష్ కురూప్. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.