విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఏ కష్టమొచ్చినా అండగా నిలబ డి నేనున్నానంటూ ధైర్యం చెప్పే పర్సన్ ఫ్యామిలీలో ఒకరుంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబం లో మా నాన్న ఫ్యామిలీ స్టార్. దర్శకుడు పరశురామ్ ఈ కథ చెబుతున్నప్పుడు మా నాన్న గుర్తొచ్చాడు. అందు కే ఇందులో నా పాత్రకు మా నాన్న పేరు గోవర్ధన్ అని పెట్టమన్నాను అన్నారు. నా పాత్రకు మా నాన్న పేరు పెట్టుకుంటే ఎమోషన్స్ పలికించడం సులువు అవుతుందని భావించా. ఈ సినిమా కోసం 9 నెలలు వర్క్ చేశా. సంక్రాంతికి రాలేకపోయాం. కానీ ఏప్రిల్ 5 ఫర్‌ఫెక్ట్ డేట్ అనుకుంటున్నాం. రాజుగారి బ్యానర్‌లో కేరింత ఆడిష న్‌కు వెళ్లాను. సెలెక్ట్ కాలేదు. అప్పుడే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నా. ఈ సినిమాకు రాజుగారే నాకు చెక్ పంపారు. ఆయనకు ఈ సినిమాతో బిగ్‌హిట్ ఇస్తా అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ఈ సినిమాకు విజయ్ క్యారెక్టర్ వెన్నెముక . నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, ఫైట్ చేస్తాడు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తాడు. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో ముప్పైశాతం ఫ్యామిలీ, డబ్బు శాతం లవ్‌స్టోరీ ఉంటుంది. మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. మా సంస్థలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వచ్చాయి. ఒక్క శ్రీనివాస కల్యాణం సినిమా విషయంలో తప్ప నా గురి తప్ప లేదు. కుటుంబాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చే వారంతా ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పడమే మా సినిమా ఉద్దేశ్యం, విజయ్ దేవరకొండంతో భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నా. ప్రీ ప్రొడక్షన్స్‌కు టైమ్ పడు తుంది. విజయ్ ప్రొడ్యూసర్స్ హీరో. అందుకే తనతో మరో రెండు సినిమాలు చేస్తా’ అని చెప్పారు. మన జీవితా ల్లోని ఎమోషన్స్, స్ట్రగుల్స్, అఛీవ్‌మెంట్స్‌ను ప్రతీ ఒక్కరు ఈ సినిమాలో చూసుకుంటారని కథానాయిక మృణాల్ ఠాకూర్ పేర్కొంది. ఈ చిత్రం నెల 5న విడుదల కానుంది.