Namaste NRI

నాని క్లాప్ తో లాంఛనంగా ప్రారంభమైన విజయ్ దేవరకొండ మూవీ

హీరో విజయ్‌ దేవరకొండ ఇటీవలే ఓ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. శౌర్యువ్‌ దర్శకత్వం.ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంలో తెరకెక్కించబోతున్నారు. అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాల్ని పెంచింది. ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌నిచ్చారు.

మైథలాజికల్‌ యూనివర్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌, ఫాల్‌ఔట్‌ వంటి చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్జినెజ్‌ సినిమాటోగ్రాఫర్‌గా, బ్యాట్‌మ్యాన్‌ ఫరెవెర్‌ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసిన ఎరిక్‌ డస్ట్‌ ఈ సినిమాకు వర్క్‌ చేస్తుండటం విశేషం. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహాబ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సురేష్‌ సెల్వరాజన్‌, రచన-దర్శకత్వం: శార్యువ్‌.

Social Share Spread Message

Latest News