Skip to main content

Namaste NRI

విజయ్‌ మాల్యా ఇంట …పెళ్లి సందడి 

బిలియనీర్‌ విజయ్‌ మాల్యా  ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన తనయుడు సిద్ధార్థ్‌ మాల్యా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ప్రేయసి జాస్మిన్‌ ను సిద్ధార్థ్‌ వివాహం చేసుకోబోతున్నాడు. ఈ వారంలోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ విషయాన్ని సిద్ధార్థ్‌ వెల్లడించారు. సిద్ధార్థ్‌ మాల్యా, జాస్మిన్‌ మంచి స్నేహితులు. వీరి స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. గతేడాది హాలోవీన్  రోజున జాస్మిన్‌కు సిద్ధార్థ్‌ మాల్యా ప్రపోజ్ చేసాడు. మోకాళ్లపై కూర్చొని తన ప్రేమను వ్యక్త పరిచాడు. ఇక సిద్ధార్థ్‌ ప్రేమను జాస్మిన్‌ కూడా అంగీకరించింది. దీంతో జాస్మిన్‌ చేతికి సిద్ధార్థ్‌ మాల్యా రింగ్‌ కూడా తొడిగాడు.

Social Share Spread Message

Latest News