Skip to main content

Namaste NRI

సార్‌ మేడమ్‌ గా విజయ్‌ సేతుపతి, నిత్యా మేనన్‌: అలరిస్తున్న ట్రైలర్‌

విజయ్‌ సేతుపతి, నిత్యామీనన్‌ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా సార్‌ మేడమ్‌. ఏ రగ్గ్‌డ్‌ లవ్‌స్టోరీ ఉపశీర్షిక. పాండిరాజ్‌ దర్శకుడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైలర్‌ను విడుదల చేశారు. నాతో వస్తే లైఫ్‌ ఎలా ఉంటుందోనని ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేశావు. మా అమ్మానాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్లే తిట్టుకునే విధంగా నిన్ను చూసుకుంటా అంటూ విజయ్‌ సేతుపతితో సంభాషణతో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది.

దంపతుల మధ్య వచ్చే గొడవలు హాస్యాన్ని పండించాయి. మా ఇద్దరినీ విడదీయండి అంటూ నిత్యామీనన్‌ చెప్పిన డైలాగ్‌తో కథ ఆనూహ్య మలుపు తీసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా ఆనిపించింది. చక్కటి హాస్యం, భావోద్వేగాలతో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, నిర్మాతలు: సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌, దర్శకత్వం: పాండిరాజ్‌.

Social Share Spread Message

Latest News