Skip to main content

Namaste NRI

తల ఎత్తుకునే ఫలితాన్నిఇస్తారని నమ్ముతున్నా.. స్పార్క్‌ లైఫ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో విక్రాంత్‌  

విక్రాంత్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం స్పార్క్‌ లైఫ్‌. మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై లీల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దర్శకులు హరీశ్‌శంకర్‌, మారుతి, పీపుల్‌ మీడియా టీజీ విశ్వప్రసాద్‌ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి సినిమా ఘన విజయం సాధించాలని శుభాశీస్సులు అందించారు. జీవించడం వేరు. బతకడం వేరు. అందరూ బతుకుతారు. కొందరే జీవిస్తారు. నాకు జీవించాలని ఉంది. అందుకే ఈ సినిమా తీశాను. నన్నునేను నమ్మి ఆత్మైస్థెర్యంతో ఈ సినిమా చేశా. ఈ ఆరేళ్ల ప్రయాణంలో చాలా కష్టాలు పడ్డాను. తల ఎత్తుకునే ఫలితం ఇస్తానని నమ్ముతున్నాను. నటీనటుల పరంగానే కాదు, సాంకేతికంగా కూడా అద్భుతంగా ఉంటుందీ సినిమా అని విక్రాంత్‌ అన్నారు. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారని, కచ్చితంగా విజయం సాధిస్తామని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్ర యూనిట్‌ సభ్యులందరూ మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events