Skip to main content

Namaste NRI

విరాటపర్వం ట్రైలర్‌ విడుదల

రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా దగ్గుబాటి, వెన్నెల అనే యువతిగా సాయి పల్లవి నటించారు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ వేడుక కర్నూలులో జరిగింది. ఇక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు ఉన్నదల్లా ఊపిరికీ మధ్య ఊపిరి సలపని యుద్ధం మాత్రమే (రానా), నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తలరాతలో మాత్రం కచ్చితంగా నేను ఉంటా (సాయిపల్లవి) వంటి డైలాగులతో విరాపటర్వం ట్రైలర్‌ సాగుతుంది. ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు రానా, సాయిపల్లవిలతో పాటు చిత్ర యూనిట్‌ హాజరయ్యారు.  ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వాహబ్‌, ఈశ్వరీరావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందించారు. అయితే  భారీ ఊదరు గాలులు, వర్షం కారణంగా కర్నూలులో విరాటపర్వం ట్రైలర్‌ లాంచ్‌ వేడుక ప్లాన్‌ చేసిన విధంగా సాగలేదు. దీంతో రానా, సాయిపల్లవి, దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడి కార్యక్రమాన్ని ముగించారు. సురేశ్‌ బాబు సమర్పణలో సూధాకర్‌ చెరకూరి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 17న రిలీజ్‌ కానుంది.

Social Share Spread Message

Latest News