Namaste NRI

మంగోలియాలో వ్లాదిమిర్ పుతిన్ పర్యటన

Mayfair 148

సెప్టెంబర్ 3వ తేదీన  మంగోలియాకు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వెళ్లుతున్నారు. ఇక్కడ వివాదాస్పద విషయం ఒకటి ఉంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి)లో మంగోలియా ఓ సభ్యదేశంగా ఉంది. కాగా ఉక్రెయిన్ యుద్ధనేరాల సంబంధిత అంశంలో పుతిన్‌పై ఐసిసి గత ఏడాది అరెస్టు వారంటు జారీ చేసింది. ఈ దేశంలో పుతిన్ తొలిసారిగా పర్యటించనున్నారు. ఐసిసి వారంటు జారీ తరువాత దీని పరిధిలోని వారు సభ్య దేశాల భూభాగంలోకి వస్తే నిబంధనల ప్రకారం వారిని అరెస్టు చేయాల్సి ఉంటుంది. యుద్ధ నేరాల చట్టాల పరిధిలో విచారణకు తరలించాల్సి ఉంటుంది. ఐసిసి పరిధిని , అధికారాలను తాము అంగీకరించడం లేదని పుతిన్ అధికార ప్రతినిధిడిమిట్రీ పెస్కోవ్ గతంలోనే పేర్కొన్నారు. కాగా మరోమారు ఆయన ఇదే విషయం స్పష్టం చేస్తూ మంగోలియాలోని తమ సానుకూల మిత్రులతో ఎప్పటికప్పుడు అత్యద్భుత సంప్రదింపులు సాగుతూ ఉన్నాయని, మంగోలియాకు తమ దేశ నేత పర్యటన విషయంలో ఎటువంటి ఆందోళన లేదని కూడా వివరించారు.

Ixora 149
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events