Skip to main content

Namaste NRI

ప్రవాసులకు వార్నింగ్… ఇకపై జాగ్రత్త

నివాసితులు, ప్రవాసులకు కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ ట్రాఫిక్ జరిమానాలు చెల్లించమని వచ్చే నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గుర్తుతెలియని వెబ్‌సైట్లు, ఫేక్ సందేశాలకు ఎట్టిపరిస్థితుల్లో స్పందించవద్దని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా కోరింది. కొందరు కేటుగాళ్లు నకిలీ సందేశాల ద్వారా ప్రజలకు ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాల్సింది బోగస్ లింక్స్ పంపించడం జరుగుతుందని, అలాంటి లింక్స్‌పై క్లిక్ చేయొద్దని తెలిపింది.  ఏదైనా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉంటే  అధికారిక సహెల్ యాప్  పై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సందేశాలు పంపుతుందని అధికార యంత్రాంగం వివరించింది. అలాంటి సందేశాలకు మాత్రమే స్పందించి నిర్ధేశిత సమయంలోగా ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని అధికారులు తెలిపారు. అనవసరంగా ఫేక్ సందేశాలకు స్పందించి డబ్బులు పొగొట్టుకోవద్దని ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వశాఖ వార్న్ చేసింది. నకిలీ సందేశాల ద్వారా భయపెట్టే ప్రయత్నాలు జరిగితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది.

Social Share Spread Message

Latest News