Skip to main content

Namaste NRI

ఈ సినిమాతో మరోసారి చరిత్ర సృష్టిస్తాం: మణిరత్నం

మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటించిన చిత్రం థగ్‌లైఫ్‌.  పీరియాడిక్‌ కథాంశంతో భారీ మల్టీ స్టారర్‌ గా ఈ సినిమా రానుంది. ఇటీవల ఓ  అవార్డు వేడుకలో పాల్గొన్న మణిరత్నం థగ్‌లైఫ్‌ చిత్రం గురించి మాట్లాడా రు. కమల్‌హాసన్‌తో సినిమా తీయడానికి 37 ఏళ్ల విరామానికి గల కారణాలను వివరించారు. కమల్‌ హాసన్‌ బహు ముఖ ప్రజ్ఞాశాలి. ఆయనతో సినిమా తీయాలంటే భారీ హంగులున్న కథ అవసరం. అది ఆయన స్థాయికి సరిపోవాలి. అందుకే ఇన్నేళ్లు వేచిచూశాను. థగ్‌లైఫ్‌ కమల్‌ స్థాయికి తగిన కథ. ఈ సినిమాతో మేం మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం అని చెప్పారు మణిరత్నం. కొద్ది మాసాల క్రితం విడుదల చేసిన థగ్‌లైఫ్‌ ఫస్ట్‌లుక్‌ కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. రాజ్‌ కమల్‌ ఇంటర్నేష నల్‌, మద్రాస్‌ టాకీస్‌ పతాకాలపై కమల్‌హాసన్‌, మణిరత్నం, ఆర్‌.మహేంద్రన్‌, శివ అనంత్‌ నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News