Namaste NRI

దసరాకు పెళ్లి సందడి

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం పెళ్లి సందడి. అనేకమైన అంతరాల్ని ఛేదిస్తూ ఓ ప్రేమజంట పయనం విజయ తీరాలకు ఎలా చేరిందన్నదే తమ చిత్ర ఇతివృత్తమని అంటున్నారు దర్శకుడు. రోషన్‌, శ్రీలీల జంటగా నటిస్తున్నారు. గౌరి రోణంకి దర్శకురాలు. మాధవి కోవెలమూడి, శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు. దసరాకు సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ కుటుంబ విలువల సమ్మిళితంగా సాగే ప్రేమకథా చిత్రమిది. ఓ జంట ప్రణయబంధం ఎలా పరిణయంగా మారిందనేది హృద్యంగా ఉంటుంది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌కు హీరో చక్కటి శుభారంభాన్ని అందిస్తుంది. రాఘవేంద్రరావు పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సెన్సార్‌ పూర్తయింది క్లీన్‌ యు సర్టిఫికెట్‌ లభించింది అని తెలిపారు. ప్రకాష్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, రావురమేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ : సునీల్‌ కుమార్‌ నామ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events