Namaste NRI

వాట్సాప్ భారీ జరిమనా.. రూ.2 వేల కోట్ల ఫైన్

వాట్సాప్‌ కంపెనీకి ఐర్లాండ్‌లోని యూరోపియన్‌ యూనియన్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ భారీ జరిమానా విధించింది. యూరోపియన్‌ యూనియన్‌ డేటా ప్రైవసీ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు దాదాపు రూ.2. వేల కోట్ల (22.5 మిలియన్‌ యూరోలు) ఫైన్‌ వేసింది. 2018కి సంబంధించిన ఈ కేసుపై విచారణ చేపట్టిన కమిషన్‌ ఈ మేరకు ఆ కంపెనీ రూల్స్‌ తప్పినట్లు తేల్చింది. కమిషన్‌ ఇప్పటి వరకు ఇంత మొత్తంలో ఏ కంపెనీకీ ఫైన్‌ వేయలేదు. యూజర్ల డేటాను ఎలావాడుకుంటాం? ఫేస్‌బుక్‌తో ఎలా షేర్‌ చేసుకుంటాం అనే విషయాలను చెప్పడంలో వాట్సాప్‌ విఫలమైందని కమిషన్‌ పేర్కొంది. యూరోప్‌ జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ మేరకు ప్రైవసీ పాలసీని అమలు చేయాలని సూచించింది. కాగా, యూజర్ల ప్రైవసీకి కట్టబడి ఉన్నామని వాట్సాప్‌ ప్రతినిధి తెలిపారు. కమిషన్‌ నిర్ణయంపై అపంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై అప్పీల్‌కు వెళ్తున్నామన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UULmVdT0LRtF67ZbuX2dEeQQ&layout=gallery[/embedyt]