Skip to main content

Namaste NRI

గణతంత్ర వేడుకలకు బైడెన్‌ రాకపోవచ్చేమో

వచ్చే నెలలో జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. జనవరి 26, 2024న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలంటూ బిడెన్‌ను భారత ప్రధాని మోదీ ఆహ్వానించారని ఇండియాలోని భారత అంబాసిడర్ ఎరిక్ గర్సెట్టి గుర్తుచేశారు. అయితే భారత ఆహ్వానంపై ఎలాంటి స్పందన లేదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి . మరోవైపు వచ్చే ఏడాది 2024 ద్వితీయార్ధంలో భారత్ వేదికగా క్వాడ్ సదస్సును నిర్వహించాలనే ప్రతిపాదన ఉందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. క్వాడ్ సదస్సుకు సంబంధించిన తేదీలను సవరించాలని భావిస్తున్నామని, ప్రతిపాదిత తేదీల్లో అన్ని భాగస్వామ్య దేశాలు సదస్సుల్లో పాల్గొనే అవకాశం లేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Social Share Spread Message

Latest News