Skip to main content

Namaste NRI

ప్రపంచంలోనే అత్యంత పొట్టి వివాహిత జంట.. గిన్నిస్ రికార్డు

ప్రపంచంలోనే పొట్టి జంటగా బ్రెజిల్‌కు చెందిన పౌలో గాబ్రియెల్‌ ద సిల్వ బర్రోస్‌(31), కట్యుసియా లై హోషినో (28) గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. 2006లో ఆన్‌లైన్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమైన వీరిద్దరూ తర్వాత 15 ఏండ్ల పాటు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వీరిలో పౌలో ఎత్తు 90.28 సెంటీమీటర్లు కాగా, కట్యుసియా ఎత్తు 91.13 సెంటీమీటర్లు. గిన్నిస్‌ రికార్డు పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఈ దంపతులు..తమ ఎత్తు తక్కువే అయినా మనసులు మాత్రం పెద్దవని, ఒకరినొకరం చాలా ప్రేమించుకుంటామని చెప్తున్నారు.

Social Share Spread Message

Latest News