సమంత కథానాయికగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం యశోద. వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరి`హరీష్ ద్వయం దర్వకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే యాక్షన్ థ్రిల్లర్ ఇది. యశోద పాత్రను సమంత సొంతం చేసుకున్న తీరు చూస్తే చాలా గర్వంగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్ని అద్భుతంగా చేసింది. వంద రోజులు షూటింగ్ జరిపాం. ఈ నెల 15న డబ్బింగ్ కార్యక్రమాలను ఆరంభిస్తాం. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను రిలీజ్ చేయనున్నామన్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంగీతం: మణిశర్మ, కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్. ఫైట్స్: వెంకట్, యానిక్బెన్, మాటలు: పులగం చిన్నారాయణ, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణరెడ్డి.














