Skip to main content

Namaste NRI

ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తి యశోద

సమంత కథానాయికగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం యశోద. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరి`హరీష్‌ ద్వయం దర్వకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన చిత్రం ఇది. ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. యశోద పాత్రను సమంత సొంతం చేసుకున్న తీరు చూస్తే చాలా గర్వంగా ఉంది. యాక్షన్‌ సన్నివేశాల్ని అద్భుతంగా చేసింది. వంద రోజులు షూటింగ్‌ జరిపాం. ఈ నెల 15న డబ్బింగ్‌ కార్యక్రమాలను ఆరంభిస్తాం. పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను రిలీజ్‌ చేయనున్నామన్నారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  సంగీతం: మణిశర్మ, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌. ఫైట్స్‌: వెంకట్‌, యానిక్‌బెన్‌, మాటలు: పులగం చిన్నారాయణ, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణరెడ్డి.

Social Share Spread Message

Latest News