Skip to main content

Namaste NRI

మొన్న దుబ్బాకలో, ఈరోజు అచ్చంపేటలో

అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గువ్వల బాలరాజు పై కాంగ్రెస్‌ నాయకుల దాడిని బీఆర్‌ఎస్‌  సౌత్‌ ఆఫ్రికా శాఖ తీవ్రంగా ఖండించింది.  ఈ సందర్భంగా అధ్యక్షులు గుర్రాల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రజా సేవ కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలువాలని దాడులతో కాదని అన్నారు. తెలంగాణ లో పది సంవత్సరాలుగా మచ్చుకు కూడా రౌడీయిజం సంస్కృతి లేదని అన్నారు. మొన్న దుబ్బాకలో, ఈరోజు అచ్చంపేట లో దాడులకు దిగడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదని, కనీసం ఆ పార్టీ నాయకులకు ఓటర్ల వద్ద చెప్పుకోవడానికి ఏమి లేదని తెలిపారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు ఓటుతో పట్టం కట్టనున్నారని జోస్యం చెప్పారు.

Social Share Spread Message

Latest News