Skip to main content

Namaste NRI

డాలస్‌ లో యోగా డే వేడుకలు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్‌ 21) పురస్కరించుకుని మహాత్మా గాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ ఆధ్వర్యంలో అమెరికాలోని డాలస్‌లో మహాత్మా గాంధీ మెమోరియల్‌ వద్ద ప్రవాస భారతీయులు యోగా శిక్షణ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ అసీం మహాజన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్‌ 21న యోగా కార్యక్రమం జరపడం ఎంతో షంతోషదాయకమన్నారు. ప్రతి రోజూ యోగా చెయ్యడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడంలో సహాయపడిన కార్యకర్తలకు, యోగా శిక్షణ ఇచ్చిన యోగా మాస్టర్‌ విజయ్‌, ఐరిస్‌, ఆనందీలకు, ముఖ్య అతిథి కాన్సల్‌ జనరల్‌ అసీం మహాజన్‌కు మహాత్మా గాంధీ మెమోరియల్‌ బోర్డ్‌ సభ్యుడు దినేష్‌ హూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ ఉత్తరాధ్యక్షుడు దినేష్‌ హుడా, బోర్డు సభ్యులు రాజీవ్‌ కామత్‌, షబ్నం మోడ్గిల్‌, పలు సంస్థల సభ్యులు, ప్రవాస భారతీయులు, చిన్నారులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News