Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ధన్యవాదాలు

ఉక్రెయిన్‌ సంక్షోభ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఇద్దరూ చర్చించుకున్నారు. సుమారు 35 నిమిషాల పాటు వీళ్ల మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. రష్యా కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో భారత్‌లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపును వేగవంతం చేయాలని, అందుకు సహకరించాలని జెలెన్‌స్కీని మోదీ కోరారు. ప్రత్యేకించి సుమీ రీజియన్‌ నుంచి తరలింపు క్లిష్టంగా మారిన తరుణంలో అక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించాలని మోదీ, జెలెన్‌స్కిని కోరినట్లు తెలుస్తోంది.        

          రష్యాతో ఒకవైపు పోరు కొనసాగిస్తున్నప్పటికీ నేరుగా శాంతి చర్చల నిర్ణయం తీసుకోవడంపై జెలెన్‌స్కీని ప్రధాని మోదీ అభినందించారు. అంతేకాదు భారతీయుల తరలింపు విషయంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  అలాగే ఇప్పటికి మిగిలిపోయిన భారతీయులను సూమి నుంచి తరలించేందుకు సహకరించాలని మోదీ కోరారు. ఉక్రెయిన్‌, రష్యా మధ్య మూడో విడత శాంతి చర్చలు జరుగనున్న సమయంలో ఇరు దేశాధినేతలతో ప్రధాని మోదీ చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Social Share Spread Message

Latest News