Skip to main content

Namaste NRI

గ్రాండ్‌గా తల మూవీ టీజర్ లాంఛ్

అమ్మ రాగిన్‌ రాజ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం తల. అమ్మ రాజశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగాసూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ఎన్‌వీప్రసాద్‌, వాకాడ అంజన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానుంది. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తున్నా. యాక్షన్‌, థ్రిల్లింగ్‌, కామెడీ ఎలిమెంట్స్‌తో సాగే వినూత్నమైన కథ ఇది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ మెచ్చే అన్ని అంశాలుంటాయి అన్నారు.

ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురిచేయడంతో పాటు చక్కటి వినోదాన్ని పంచే చిత్రమిదని హీరో అమ్మ రాగిన్‌ రాజ్‌ పేర్కొన్నారు. ఎస్తేర్‌, అవినాష్‌, సత్యం రాజేష్‌, అజయ్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: తమన్‌, ఎస్‌.అస్లాం కేయి, ధర్మతేజ, కథ, కొరియోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్‌.

Social Share Spread Message

Latest News