Skip to main content

Namaste NRI

35 చిన్న కథ కాదు నుంచి.. చిన్నా ఇది వింతలోకం

ప్రియదర్శి, నివేదా థామస్‌, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 35 చిన్న కథ కాదు. నందకిషోర్‌ ఈమాని దర్శకుడు. ఈ చిత్రం నుంచి చిన్నా ఇది వింతలోకం అనే పాటను విడుదల చేశా రు. అందమైన బాల్యాన్ని, పిల్లల్లోని అమాయకత్వాన్ని అందంగా ప్రజెంట్‌ చేస్తూ ఈ పాట సాగింది. వివేక్‌సాగర్‌ స్వరపరచిన ఈ గీతాన్ని భరద్వాజ్‌ గాలి రచించారు.విజయ్‌ప్రకాష్‌ ఆలపించారు. తిరుపతి నేపథ్యంలో నడి చే ఈ కథలో మధ్యతరగతి తండ్రిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాన్ని, సంఘర్షణను హృద్యంగా ఆవిష్క రిస్తున్నామని, స్కూల్‌ ఎపిసోడ్స్‌ ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని మేకర్స్‌ తెలిపారు.

ఈ చితాన్ని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: నికేత్‌ బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్‌, నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి, దర్శకత్వం: నందకిషోర్‌ ఈమాని.

Social Share Spread Message

Latest News