వియత్నాంలో టూరిస్ట్ బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భారతీయులతో సహా 15 మందికి పైగా పర్యాటకులు మరణించారు. సముద్రంలో పలువురు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టారు. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో ఈ సంఘటన జరిగింది. హాలాంగ్ బేలో 32 మంది పర్యాటకులు ఉన్న టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బోల్తా పడిన బోటు నుంచి పలువురిని కాపాడారు. భారతీయులతో సహా 15 మందికిపైగా టూరిస్టులు మరణించగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తున్నది. మృతుల్లో తెలంగాణ, ఏపీకి చెందిన పర్యాటకులు ఉన్నట్లు సమాచారం.

కాగా, వియత్నాంలో జరిగిన బోటు బోల్తా ప్రమాదంలో మరణించిన వారిలో పలువురు భారతీయులు ఉన్నట్లు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. స్థానిక అధికారుల సమన్వయంతో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.





























