Namaste NRI

ఈ నెల 10న వస్తున్న గ్యాంగ్ స్టర్ నయీం డైరీస్

పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథతో తెరకెక్కిన చిత్రం నయీం డైరీస్‌. డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాము బాలజీ దర్శకత్వంలో సీఏ వరదరాజు నిర్మించారు. వశిష్ఠ సింహ ప్రధాన పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు వస్తున్న ఆదరణకు చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింంది. వరదరాజు మాట్లాడుతూ వశిష్ట సింహ నటన సినిమాకు ప్రత్యేకాకర్షణ. యాక్షన్‌ డ్రాప్‌లో ప్రేక్షకులను చక్కని వినోదం పంచుతుంది అన్నారు. దాము మాట్లాడుతూ రాజకీయ, పోలీస్‌ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయి అనేది ధైర్యంగా సినిమాలో చూపించాం అన్నారు. నయీం ఎన్‌కౌంటర్‌ అయ్యాక అతని గురించి పూర్తి అధ్యయనం చేశాం. నయీం సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అతని డైరీలో పేర్కొన్న విషయాలను ఎలాంటివదేని తెరపైనే చూడాలి. యజ్జశెట్టి, దివి కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి అరుణ్‌ ప్రభాకర్‌ సంగీత దర్శకుడు. యజ్ఞశెట్టి, దివి. బాహుబలి నిఖిల్‌, శశికుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : సురేష్‌ భార్గవ్‌. .

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events